గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

నవతెలంగాణ- యైటింక్లైన్ కాలనీ: గురువారం ఉదయం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంత్ నగర్ ఫ్యాక్టరీ గేట్ బస్ స్టాప్ వద్ద కరీంనగర్ వైపు నుండి వస్తున్న బస్ ఆపి నమ్మదగిన సమాచారం మేరకు బస్ లో అనుమానస్పదంగా ఉన్న ఒక వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న బ్యాగ్ లో 6.400 కిలోల డ్రై గంజాయి లభించింది. దీని విలువ సుమారు,1,60,000/- రూపాయలు ఉంటుంది. అనంతరం అతడిని విచారించగ అతని పేరు బాదే వినయ్ కుమార్ అని తెలిపి చెడు అలవాట్లకు, గంజాయి కి బానిసై గంజాయి తను తాగడం కోసం, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో విశాఖపట్నం లో ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి 8. ఇంక్లైన్ కాలనీ ప్రాంతంలోని అమాయకపు స్టూడెంట్స్, యువత కి ఎక్కువ ధరకు అమ్ముతానని తెలపడం జరిగింది. నిందితున్ని అతని వద్ద లభించిన గంజాయి స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.