
ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకునూరు గ్రామ శివారు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది పట్టుకొని చేర్యాల పోలీసులకు అప్పగించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకునూరు శివారులో అదే గ్రామానికి చెందిన మంతపురి ప్రశాంత్ శుక్రవారం తన ట్రాక్టర్ నెంబర్ ఏపీ 23కె 3958 లో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, సిబ్బంది వెళ్లి ట్రాక్టర్ ను పట్టుకొని చేర్యాల పోలీసులకు అప్పగించామని తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసినా పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.