– ఏజీఅండ్‌పీ సీఈఓ వెల్లడి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎన్‌జీ, పీఎన్‌జీలపై పన్ను తగ్గించడం పట్ల ఏజీ అండ్ పీ ప్రథమ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సహజ వాయువులపై ఇంతక్రితం 24.5 శాతంగా ఉన్న వ్యాట్‌ను ఇప్పుడు 5 శాతానికి తగ్గించినందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎజిఅండ్‌పి ఎండీ, సీఈఓ అభిలేష్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం సీఎన్‌జీ కిలో ధర రూ.93గా ఉండగా.. ప్రభుత్వ నిర్ణయంతో వచ్చే ఏప్రిల్ 1 నుంచి 79కి తగ్గనుందని పేర్కొంది.