సమాజానికి మార్గదర్శి ఉపాధ్యాయుడే..

The teacher is the guide of the society.– రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పోచారం
నవతెలంగాణ – బాన్సువాడ నసురుల్లబాద్ 
విద్యార్థి వృత్తిలో మరియు వ్యాపారంలో విజయం సాధించడానికి ఉపాధ్యాయుడు అందించే విద్య విద్యార్థి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలో నీ రెడ్డి సంఘంలో నిర్వహించిన బాన్సువాడ బీర్కూర్ నస్రుల్లాబాద్ మండలాల ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మూడు మండలాల విద్యాధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యకు అధిక ప్రాధాన్యత  ఇవ్వాలని, మనిషికి చదువు లేని బ్రతుకు శూన్యం అని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ప్రతి  మనిషికి మార్గదర్శి గురువేనని అన్నారు. మంచి జీవితాన్ని గడపడానికి నిజంగా పునాది వేసేది ఉపాధ్యాయుడే. తల్లిదండ్రుల తర్వాత అధిక ప్రాధాన్యత ఇచ్చేది గురువుకేనని అన్నారు. సమాజంలో మంచి మనుషులుగా, దేశానికి మంచి పౌరులుగా మారేందుకు సద్గురువు మనకు తోడ్పడతాడన్నారు.  ఉపాధ్యాయుల ప్రశంసలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఉపాధ్యాయులు దేశంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు. ఈ రోజు మనం వ్యాపారం, రాజకీయాలు మరియు సమాజంలో చూసే ప్రతిదీ ఉపాధ్యాయులు అందించినవే అన్నారు. ఉపాధ్యాయులను దేవుని కంటే ఎక్కువగా పరిగణిస్తారని అన్నారు, కాబట్టి భారతదేశంలో ప్రతి సంవత్సరం; మేము సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామన్నారు. ఈ సంద్భంగా  ఏంఇఓ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ బాన్సువాడ డివిజన్ పరిధిలో డివిజన్ విద్య శాఖ భవనం శిథిలవస్థకు చేరుకుందని, నూతన భవనం మంజూరు చేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వరరావు టిఆర్టియు నాయకుడు కుశాల్, నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి , మాజిద్, శ్యామల, ఏఎంసీ చైర్మన్ నర్సింలు, నార్ల సురేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.