ఆధ్యాపకుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి 

The teaching posts should be filled immediately– ఎస్ఎఫ్ఐ నాగార్జునసాగర్ డివిజన్ కమిటీ 
నవతెలంగాణ – హాలియా 

అనుముల మండలం హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఆధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ నాగార్జునసాగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో  కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నల్లబెల్లి జగదీష్, కోరే రమేష్ మాట్లాడుతూ.. కళాశాల ప్రారంభమై సుమారు 5 నెలలు గడుస్తున్న విద్యార్థులకు మాథ్స్ మరియు బోటనీ  బోధించడానికి  ఉపాధ్యాయులు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు కలిపి ఎంపీసీ ,బైపీసీ  చదువుతున్న విద్యార్థుల సంఖ్య 118 మంది ఉన్నారు. పేద మధ్య తరగతి చదువుకునే ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయుల లోటు ఉంటే వాళ్ళు విద్యను ఎలా కొనసాగించాలి అని అన్నారు. వెంటనే మ్యాత్స్, మరియు బోటనీకి ఉపాధ్యాయులని నియమించాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్న విద్యార్థుల భవిష్యత్తు మాత్రం మారడం లేదు అని  ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని జూనియర్ కళాశాలలో కనీస మౌలిక వసతులు బాత్రూంలో, ప్రహరీ గోడ, లైట్స్, వాటర్, ఫ్యాన్స్,లేక విద్యార్థులు వసతులు పడుతున్నారు. తక్షణమే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని వారు అన్నారు  కార్యక్రమంలో అనుముల మండల కార్యదర్శి ఆలేటి చెందు, హలీయ టౌన్ అధ్యక్షులు వర్షిత్, వరప్రసాద్, గోపి తదితరులు పాల్గొన్నారు.