మండల కేంద్రంలోని బాలికల హాస్టల్ ని తహసీల్ధార్ పి శ్రీనివాసరావు శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల రిజిస్టర్, బియ్యం స్టాక్ రిజిస్టర్ లను, భోజన మెనూ నాణ్యతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. హాస్టల్లో మౌలిక సదుపాయాలైన మరుగుదొడ్ల సౌకర్యం, నీటి సదుపాయం పరిశుభ్రతను పాటించడం వంటి విషయాలను విద్యార్థులతో చర్చించి వారి అభిప్రాయాలలో అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్య ఆరోగ్య సిబ్బంది సహకరించే విధానాన్ని కూడా తెలుసుకున్నారు. బాలికల భద్రత కోసం ప్రతిరోజు హాస్టల్లో ఇద్దరు రాత్రి సమయంలో ఉండాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు. వారి వెంట ఎంపీడీవో సునీత హాస్టల్ వార్డెన్ పద్మ సిబ్బంది తదితరులు ఉన్నారు.