జిట్టా వల్లనే బలమైన శక్తిగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం..

Telangana State Sadhana Movement became a strong force because of Jitta..– భువనగిరిలో జిట్టా విగ్రహం ఏర్పాటుకు కృషి..
– జిట్టా కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే కుంభం 
– సంతాప సభలో మాట్లాడకుండానే వేనుతిరిగిన  మాజీ మంత్రి కేటీఆర్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్                    
మళ్లీదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్నికీ వేగుచుక్కగా నిలిచి రాష్ట్ర సాధన ఉద్యమ నేతగా మారిన జిట్టా బాలకృష్ణరెడ్డి మరణం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తీవ్రమైన లోటని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణరెడ్డి సంతాప సభ ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఏపూరి సోమన్న తన కళా బృందంతో నివాళులు అర్పించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి జిట్టా చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆనాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో జిట్టా బాలకృష్ణరెడ్డి తన సొంత ఆస్తులను అమ్ముకొని ఉద్యమాన్ని ఉధృతం చేసి అందరినీ చైతన్యపరిచి రాష్ట్ర సాధన మహోద్యమ నేతగా ఎదిగారని అన్నారు. జిట్టాకు ఎలాంటి పదవిలేకపోయిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల కోసం ఎంతో కృషి చేశారని, మూసి కాలుష్యపు ప్రాంతాల్లో పాదయాత్ర చేసి ప్రతి గ్రామంలో వాటర్ పీల్టర్ ఏర్పాటు చేసిన ఘనత జిట్టా బాలకృష్ణరెడ్డికే దక్కిందని అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని భువనగిరి జిల్లా కేంద్రంలో తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు నుంచి జిట్టా అనుచరులకు ఆయన అభిమానులకు జిమేదారిగా ఉంటానని, జిట్టా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణరెడ్డి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
జిట్టాకు నివాళులర్పించిన మాజీ మంత్రి కేటీఆర్..
జిట్టా బాలకృష్ణారెడ్డికి మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే  కేటీఆర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. మన కుటుంబ సభ్యులను పరామర్శించి, మాట్లాడారు. కానీ  జిట్టా  సంతాప సభలో ఆయన మాట్లాడకపోవడంతో   బిఆర్ఎస్ శ్రేణులు నిరాశ చెందాయి. నివాళులర్పించిన వారిలో మాజీ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ తక్కడపెల్లి రవీందర్రావు, ఏం కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి,  మాజీ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, బూడిద  బిక్షమయ్య గౌడ్, గాదరి కిషోర్, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్,  రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి,  భువనగిరి  మున్సిపల్ చైర్మన్ పొతంశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పోత్నక్ ప్రమోద్ కుమార్, జిట్టా బాలకృష్ణరెడ్డి కుటుంబ సభ్యులు,  అభిమానులు పాల్గొన్నారు.