– రామోజీకి నివాళులర్పించిన పువ్వాడ
నవతెలంగాణ-ఖమ్మం
విభిన్న రంగాలలో అసమాన్య ప్రతిభ చూపిన ప్రజ్ఞావంతుడు రామోజీరావు మరణంతో తెలుగుజాతి ఒక ప్రజ్ఞావంతున్ని, మార్గదర్శిని కోల్పోయిందని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. రామోజీ లేనిలోటు పూడ్చలేనిదని, ఆయన ఓ తరం గుర్తుంచుకోతగిన వ్యక్తి అన్నారు. శనివారం రామోజీరావు మతదేహాన్ని సందర్శించి సతీమణి పువ్వాడ విజయలక్ష్మితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలతో అంచెలంచులుగా ఎదిగి ఒకవ్యవస్థను నిర్మించారని పువ్వాడ తెలిపారు. ముఖ్యంగా మీడియా రంగంలో ఈనాడు ద్వారా అనేక సమస్యల పరిష్కారానికి రామోజీరావు కారకుడయ్యారన్నారు. సమాజం పట్ల అవగాహన కలిగి ఒక సంస్కర్తగా ఆయన వ్యవహరించారని తెలిపారు. మీడియా ద్వారా అత్యంత గుర్తింపు పొందిన వ్యవక్తులలో రామోజీ ప్రధముడని, అదే రీతిలో సినిమా పరిశ్రమ అభివద్ధి కోసం అత్యుత్తమ సినిమాలు నిర్మాంచారని, ఆసియాఖండంలోనే ప్రసిద్ధి చెందిన రామోజీఫిల్మ్ సిటీని నిర్మించారన్నారు. రామోజీరావు తెలుగుజాతి ఉన్నంత కాలం గుర్తుండి పోతారాన్నారు. పువ్వాడ వెంట మాజీ మంత్రి పువ్వాడ అజరు కుమార్, భార్య వసంతలక్ష్మి ఉన్నారు.
రామోజీ వ్యక్తికాదు ఓ వ్యవస్థ
సీపీఐ నేత బాగం హేమంతరావు
రామోజీరావు అంటే ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ అని, తన అపారత్మమైన ప్రతిభతో అత్యున్న శిఖరాలకు చేరుకున్నారని సిపిఐ జాతీయ సమితిసభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. శనివారం చెరుకూరి రామోజీ రావు సంతాపసభ స్థానిక గిరిప్రసాద్భవన్లో నిర్వహించారు. రామోజీ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా బాగం హేమంతరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జింతేందర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గసభ్యులు శింగు నర్సింహారావు, పోటు కళావతి, తాటి వెంకటేశ్వరరావు, సీహెచ్. పీతామహాలక్ష్మి, రావి శివరామకష్ణ, మేకల శ్రీనివాసరావు, జిల్లా నాయకులు గాదె లక్ష్మినారాయణ, చెరుకుపల్లి భాస్కర్, పీ.మోహన్‌రావు, మేకల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
రామోజీరావు మతికి జిల్లా కాంగ్రెస్ కమిటీ సంతాపం
తెలుగు పత్రికా దిగ్గజం, ఈనాడు గ్రూప్స్ అధినేత, పద్మవిభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని తెలిపారు.