ఆరు రోజుల్లో ముగియనున్న ఎంపీటీసీల పదవీకాలం

నవతెలంగాణ-కందుకూరు
జూలై 4వ తేదీన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా చైర్‌ పర్సన్‌ పదవి కాలం ముగియనున్నది. మండల పరి షత్‌, జిల్లా పరిషత్‌ పదవీకాలం 5 ఏండ్లు పూర్తయింది. 2019 మే నెల 10వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించారు. అంటే వీరి ప దవి కాలం 5 ఏండ్లు పూర్తయింది. కందుకూరు మం డ లంలో మొత్తం 16 మంది ఎంపీటీసీలు, ఒక కో ఆప్షన్‌ సభ్యులుతో కలుపుకొని 17 మంది ఉన్నారు. మండల పరిషత్‌ సభ్యులు ఉన్నారు. 5 ఏండ్ల కింద ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీలు, సభ్యులు బీజేపీకీ సం బంధించిన ఎంపీటీసీలు: కొత్తూరు బొక్క జ్యోతి, ముచ్చర్ల బక్క మల్లేష్‌, దెబ్బడగూడ ఎల్మటి లక్ష్మీ, రాచులూరు బాల్‌ రాజు, గుమ్మడవెల్లి రేఖ బాబురావు, గూడూరు ఎల్లారెడ్డి, తిమ్మాపూర్‌ మంద జ్యోతి, బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు: చిప్ప లపల్లి సురమోని లలిత, జైతారం సురేష్‌, దాసర్లపల్లి తాండ్ర ఇందిరా, కందుకూరు రాజశేఖర్‌ రెడ్డి, మీరు ఖాన్‌ పెట్‌ రాములు, లేమూరు మంచాల యాదయ్య, స్వతం త్ర అభ్యర్థులు :పులిమామిడి రాజమ్మ, ఆకుల మైలారం అచ్చన్న పద్మ కోఆప్షన్‌ సభ్యులు ఎండీ సులేమాన్‌. గెలు పొందారు జడ్పీటీసీగా బొక్క జంగారెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన గంగు ల శమంత నేదునూర్‌ గ్రామం. గ్రామీణ ప్రాంతాల స్థాని క స్వపరిపాలన వ్యవస్థ పంచాయతీరాజ్‌లో కింది స్థాయి లో గ్రామపంచాయతీ కాగా 2వ స్థాయి వ్యవస్థ మండల ప్రజా పరిషత్‌. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్ను కుంటారు. 3,4 వేల జనాభా కలిగిన గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఎంపీటీసీగా ఏర్పాటు చేశారు. మండల పరిషత్‌ సమావేశాలకు సర్పంచులు కలెక్టర్‌ శాశ్వతంగా ఆహ్వానీతు లుగా హాజరవుతారు. ఎంపీటీసీల, మండల పరిషత్‌ పద వీకాలం పూర్తి కావస్తుండడంతో మండల స్థాయిలో ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగిస్తున్నారని తెలుస్తుంది.