నాలుగు రోజులలో సర్పంచిల పదవీ కాలం పూర్తి

సస్పెండ్ వెనుక కుట్ర పూరితం
– న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం: మహిళా సర్పంచ్
నవతెలంగాణ – ఉప్పునుంతల
గత అసెంబ్లీ ఎలక్షన్ నుండి గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలలో భాగంగా రాజకీయంగా ఎదుర్కోలేక ఒక మహిళ సర్పంచి పై పగ తీర్చుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అని ఆదివారం సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పెద్దాపురం గ్రామ మాజీ సర్పంచి అయిన నన్ను డీపీఓ సస్పెండ్ చేయడం జరిగినది. గ్రామానికి చెందిన వేముల నరసింహారావు ఫిర్యాదుతో గత రెండు రోజుల క్రితం ఫోకస్ నోటీసు ఇవ్వడం జరిగినది. డీపీఓ ఏదైతే ఏడు పాయిట్ల మీద వివరణ అడిగారో వాటికి పూర్తిగా రికార్డులు సమర్పించాము. కానీ అధికారపక్ష నాయకుని పోర్బలంతో ఎదుర్కొనే శక్తి లేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని, గ్రామాన్ని  అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తే ఏమాత్రం ఒక అధికారిని పెట్టి గ్రామపంచాయతీలో సర్పంచ్ గారితో విచారణ చేయకుండా ఏకపక్షంగా నాపైన చర్య తీసుకోవడం జరిగింది. ఒక అధికారి వచ్చే విచారణ చేస్తే, తప్పు అని తేలితే ఏ శిక్ష కైనా మేము అర్హులమే, కానీ ఈరోజు అధికారం ఉంది కదా అని ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన ఒక మహిళా సర్పంచి పై, వారు  నాలుగు రోజుల పదవి ఉండగానే ఇలాంటి చర్య తీసుకోవడం ఈ ప్రభుత్వానికి తగదు అని కోరుచున్నాను. కొన్ని రోజుల నుండి నరసింహారావు చేస్తున్న అసత్య ప్రచారాలు గ్రామంలో అందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. కొత్త రవీందర్ రావు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న కారణంగా ఈ ప్రభుత్వం మోసపూరితంగా 6 గ్యారంటీల పేరుతో, మోస పూరిత వాగ్దానాలతో గెలవడం ప్రజలను తప్పుదోవ పట్టించిందని చెప్పి, గ్రామము లో మండలంలో మీడియా ముందుకు రావడం గత కొన్ని సంవత్సరాల క్రితం నరసింహారావు భార్య వేముల నివేదిత రాజనగరం అనే రెవెన్యూ విలేజిలో ఆమె పేరుపైన భూమి లేకున్నా ఆదర్శ రైతుగా జీతం తీసుకుంటుందని అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగినది. అదేవిధంగా నరసింహారావు గ్రామానికి అతి సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలంలో 60 మీటర్ల దూరంలో కోళ్ల ఫారం నిర్మాణం చేపట్టుతుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి అడ్డుకోవడం జరిగినది. అదేవిధంగా గ్రామమునకు ఆనుకొని ఉన్న వేముల నరసింహారావు కుమారుడు వేముల భారత్ వ్యవసాయ పొలము గ్రామపంచాయతీలో ఏమాత్రం పర్మిషన్ లేకుండా లేఅవుట్ చేసి ఇరుకు బాటలు చేస్తూ, అమ్ముకొని 2 ఏకురాలుభూమి పైనా గ్రామపంచాయతీ కి లేఔట్ లో రావలసిన శాతం భూమిని ఇవ్వకుండా ఏకపక్షంగా గ్రాస్తులకు  అమ్ముకోవడం జరిగినది. ప్రతి ఎలక్షన్లో అమ్మిన భూమి గుంజుకుంటా అని బెదిరించి ఓట్లు ఏపిచ్చుకోవడంజరిగినది. అందుకు కొన్ని రోజుల క్రితం హైకోర్టులో వేముల భరత్ మీద మరియు నరసింహారావు మీద రూల్స్ ప్రకారంగా గ్రామ పంచాయతీకి రావాల్సిన భూమి గ్రామపంచాయతీకి ఇవ్వాలని, గ్రామ ప్రజలకు అమ్మిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని ఏదైతే వేముల భరతు భూమి అమ్ముకొని విదేశాలకు పోయిండు అతని పాస్పోర్టు క్యాన్సల్ చేసి విచారణకు పిలవాలని నా భర్త కొత్త రవీందర్ రావు   కోరడం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగినది     ప్రజలకు రిజిస్ట్రేషన్ చేయాలని అన్నందుకు మండలంలో బి ఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేస్తున్నందుకు ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఇలాంటి కుట్రలకు తెరలేపినారు అదేవిధంగా కొన్ని రోజుల క్రితం నుండి ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల నుండి దుందుభి నది నుండి నరసింహారావు టిప్పర్లతో ఇసుక తరలించి ఉప్పునుంతల ఊరు బయట పోసి అమ్ముకుంటుండగా నా భర్త పట్టుకొని మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగినది ఇప్పుడు నన్ను సస్పెండ్ చేపియడం జరిగినది నేను ఈరోజు అడుగుతున్న ఈ రాష్ట్ర మహిళలను ప్రజా పాలన అంటే ఒక మహిళా సర్పంచి మీద కక్షపూరితంగా ఇలాంటి చర్య తీసుకోవడం సమాజసమేనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇలాంటి చర్యలకు ఈ నియోజకవర్గ ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి తప్పు జరిగిందంటే ఎంక్వయిరీ ఆఫీసర్ ను పెట్టాలి లేకపోతే రికవరీ చేపియాలి ఒక సాధారణమైన వ్యక్తి తెల్ల కాగితం పై రాసిస్తే సస్పెండ్ చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకి ఇది అవమానకరం అని ఒక మహిళగా ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగినది మండలంలో వైకుంఠధామాలకు మరియు డంపింగ్ యార్డ్లకు ప్రభుత్వ అధికారుల ఆదేశం ప్రకారం అడ్వాన్స్ తీసుకోవడం జరిగినది 27 గ్రామపంచాయతీలో  సర్పంచులు  పనులు చేయడం అందరికీ తెలిసిన విషయమే చాలా గ్రామ పంచాయతీల సర్పంచులు ఇంతవరకు అడ్వాన్స్ పేమెంటు కట్టనేలేదు అయినా మేము మాకు రావలసిన చాలా బిల్లులు ఉన్నా పేమెంటు చెల్లించడం జరిగినది ఇప్పటికీ గ్రామపంచాయతీ నుండి నాకు 4 లక్షల రూపాయలు రావాలి గత రెండు సంవత్సరాల క్రితం బళ్ళు అనే కాంట్రాక్టర్ ఉప్పునంతల మండలానికి సంబంధించిన కొన్ని గ్రామపంచాయతీలలో నాకు తెలిసిన సమాచారం ప్రకారం 30 నుండి 40 లక్షలు S B M కింద బాత్రూంలు కట్టడానికి ప్రతి గ్రామపంచాయతీ నుండి చెక్కుల రూపకంగా సర్పంచులు  మరియు సంతకాలు చేసి ఎంపీడీవో గారికి ఇవ్వడం జరిగినది ఇందులో చాలావరకు ఏ ఒక్క బాత్రూం కూడా నిర్మాణం చేయలే ఇంతవరకు అధికారులు అతనిపైన ఏమాత్రం చర్య తీసుకోలే ఏ ఒక్క సర్పంచ్ పైన కూడా చర్య తీసుకోలే మేము గ్రామంలో ముందుండి ప్రతి లబ్ధిదారునికి పైసలు ఇచ్చి పని చేపిస్తే దానిపైన కూడా బురద జల్లి మళ్లీ ఎలక్షన్ లో గెలవాలని చూస్తున్నారు ఏది ఏమైనా న్యాయస్థానం ఉంది న్యాయస్థానము మిమ్ముల దోషిగా నిలబెట్టే వరకు ఒక మహిళా సర్పంచిగా విడిచి పెట్టనని చెప్పేసి కోరుచున్నాను మండలంలో ఉన్న గ్రామ పంచాయతీల మీద మరియు అధికారుల మీద నేను కూడా సమాచారం అడిగి తీసుకొని వారి పైన చర్య తీసుకునే విధంగా చూస్తానని తెలిపారు.