
నవతెలంగాణ – రామారెడ్డి
సర్పంచుల పదవీ కాలాన్ని పెంచి, గ్రామ పంచాయతీలకు రావలసిన నిధులను వెంటనే మంజూరు చేయాలని, 18 నెలల నిధులను వెంటనే మంజూరు చేసి గ్రామపంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని మంగళవారం పంచాయతీ రాజ్ ఫైనాన్స్ కమిషనర్ స్మిత సబర్వాల్ కు సెక్రటేరియట్లో సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పోసానిపేట సర్పంచ్, తెలంగాణ సర్పంచ్ల ఫోరం జాయింట్ సెక్రెటరీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.