బీఆర్‌ఎస్‌లో ఆ ముగ్గురి పదవీకాలం ఏప్రిల్‌తో పూర్తి

– వద్దిరాజు, జోగినపల్లి, లింగయ్య యాదవ్‌లో ఒక్కరికే మరోదఫా ఛాన్స్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గరు ఎంపీల (రాజ్యసభ) పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. వద్దిరాజు రవిచంద్ర, జోగినేపల్లి సంతోశ్‌ కుమార్‌, బడుగుల లింగయ్య యాదవ్‌ వారిలో ఉన్నారు. అయితే బీఆర్‌ఎస్‌కు రాష్ట్ర శాసనసభ సభలో ప్రస్తుత సంఖ్యాబలాన్ని బట్టి ఒక్కటే ఎంపీ సీటు తిరిగి రానుంది. వద్దిరాజుకు ఆ ఛాన్స్‌ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు సమాచారం.