నవంబరు 24 నుంచి ప్రతిష్టాత్మక డిఫెండర్ జర్నీ యొక్క మూడో ఎడిషన్ ప్రారంభం

  • డిఫెండర్ జర్నీస్ యొక్క మూడో ఎడిషన్ ఈసారి అద్భుతమైన మరియు అందర్నీ ఆశ్చర్యపరిచే 21 ప్రాంతాల్లో జరుగుతుంది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే… థార్ డెజర్ట్, జన్ స్కార్ వ్యాలీ, ఉమ్లింగ్ లా పాస్, లద్ధాఖ్ రీజియన్, స్పిటి వ్యాలీ మరియు కొంకణ్ రీజియన్‌ లాంటి ఐకానిక్ ప్రదేశాల్లో ఈసారి డిఫెండర్ జర్నీస్ ఉంటాయి.
  • ఇందులో పాల్గొనే క్లయింట్‌లకు విలాసవంతమైన బస మరియు ఆతిథ్యం అందించబడుతుంది. దీంతోపాటు ప్రత్యేకమైన సాంస్కృతిక సమ్మేళనాలు, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మరియు లైఫ్ స్టైల్ ఎంగేజ్‌మెంట్‌లతో సహా కొన్ని రోజుల ప్రయాణ అనుభవాన్ని క్లైయింట్స్ అందుకుంటారు.
  • మరింత సమాచారం కోసం సంప్రదించండి https://bit.ly/4fVxo5p

నవతెలంగాణ ముంబయి- ప్రతిష్టాత్మకమైన డిఫెండర్ జర్నీస్ యొక్క మూడో ఎడిషన్ ప్రారంభమైంది. ‘డిఫెండర్ జర్నీస్’ పేరుతో నిర్వహించే ఈ రైడ్… నవంబర్ 2024 నుంచి భారతదేశం మొత్తం 21 ప్రత్యేక ప్రాంతాల్లో జరుగుతుంది. డిఫెండర్ SUVలలో ఇది మొదటి-రకం మరియు ఏకైక లగ్జరీ, సెల్ఫ్-డ్రైవ్, అనుభవపూర్వక ప్రోగ్రామ్. డిఫెండర్ వెహికల్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఆఫ్-రోడ్ వెహికల్. ఈ వెహికల్ ద్వారా భారతదేశంలోని అత్యంత సుందరమైన ప్రదేశాల అన్వేషించే అద్బుతమైన ప్రయాణమే ఈ డిఫెండర్ జర్నీస్ కార్యక్రమం.
ఈ డిఫెండర్ జర్నీస్ లో ప్రతీ ప్రయాణం ఆలోచనాత్మకంగా రూపొందించబడింది. ఈ ప్రయాణంలో మీకు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, విభిన్న సంస్కృతులతో ముఖాముఖి, నోరూరించే వంటకాలు, ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ స్టేలు ఉంటాయి. కూర్గ్ లాంటి అద్భుతమైన కళ్లు తిప్పుకోనివ్వని సుందర దృశ్యాల నుంచి సువిశాలమైన తీర ప్రాంతాల వరకు లేదా హిమాలయాలలోని మంచుతో కప్పబడిన శిఖరాల వరకు, అలాగే  థార్ ఎడారిలో ఉండే ఇసుక తిన్నెలు… ఇలా ప్రతీ ప్రయాణం అద్భుతంగా, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయబడింది. ఇందులో పాల్గొనే క్లయింట్లు, ప్రతిష్టాత్మక డిఫెండర్ వెహికల్ చక్రాల వెనుక ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యపర్చే ప్రకృతి దృశ్యాలను గమనిస్తారు, అదే సమయంలో సంపూర్ణంగా ఆనందిస్తారు. ఇదే ఈ ప్రయాణాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని నావిగేట్ చేయడంలో క్లయింట్‌లకు సహాయం చేయడం కోసం డిఫెండర్ 110 సిద్ధంగా ఉంటుంది. ఇది పూర్తిస్థాయి ఆఫ్-రోడ్ టెక్నాలజీ, అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్, అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు, పూర్తిస్థాయి అత్యాధునిక భద్రతా ప్రమాణాలను కలిగి ఉన్న అత్యుత్తమ సామర్ధ్యం గల SUV.
ప్రయాణం మొత్తం కౌగర్ మోటార్‌స్పోర్ట్ నుంచి అంకితమైన మరియు అత్యంత నైపుణ్యం కలిగిన బోధకుల బృందం వస్తుంది. క్లయింట్‌లతో పాటు ఏదైనా సహాయం లేదా మార్గదర్శకత్వాన్ని అందించడానికి ఈ బృందం చాలా అవసరం. ఈ సందర్బంగా జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబ మాట్లాడుతూ: “మా మొదటి రెండు సీజన్‌లలో 420 మంది క్లైయింట్లు చాలా ఉత్సాహాంగా పాల్గొన్నారు. రెండు సీజన్లు కలిపి మొత్తం 39 మర్చిపోలేని రైడింగ్స్ జరిగాయి. వీటి ద్వారా, డిఫెండర్ జర్నీస్ అద్భుతమైన సాహసం మరియు మర్చిపోలేని ప్రజల జీవన విధానాలను మనకు పరిచయం చేస్తుందని అర్థమైంది. జీవితంలో థ్రిల్‌ను కోరుకునేటటువంటి వ్యక్తులను ఈ డిఫెండర్ జర్నీస్ ఒక చేట చేర్చింది. మేము విలాసవంతమైన కలయిక మరియు ప్రత్యేకమైన ఆఫ్-రోడ్ డ్రైవ్‌ల యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని సృష్టించాం. అదే సమయంలో పాల్గొనే క్లయింట్‌లలో గొప్ప స్నేహభావాన్ని పెంపొందించాము. మేము ఇప్పుడు ఈ ప్రయాణాల యొక్క మరొక సీజన్‌ని తీసుకురావడానికి సంతోషిస్తున్నాము. భారతదేశంలో చాలా ఉద్వేగభరితమైన డిఫెండర్ కమ్యూనిటీని మరింతగా పెంచడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అని అన్నారు.