రేపటీ నుండి మూడో దశ ఇంటర్ ప్రయోగ పరీక్షలు….

– అశ్వారావుపేట లో 96 మంది పరీక్షార్ధులు…

– ప్రిన్సిపాల్ సాగర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లాల్లో నేటి నుండి ఇంటర్ విద్యార్థులకు మూడో దశ ప్రయోగ పరీక్షలు సోమవారం నుండి నిర్వహించనున్నారు.ఈ మేరకు అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.సాగర్ పరీక్షలు టైం టేబుల్ ను శనివారం వెల్లడించారు. ఈ నెల 11వ తేది( సోమవారం) నుండి 14వ తేదీ (గురువారం) వరకు ఉదయం 9 గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటలు వరకు, సాయంత్రం 2 గంటలు నుండి 5 గంటలు వరకు రెండు పూటలా నిర్వహిస్తామని, విద్యార్దులు ఒక ముందుగానే అనగా ఉదయం 8 గంటలకు, సాయంత్రం ఒంటి గంటకు హాల్ టికెట్ తో సహా హాజరు కావాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో జూనియర్ కళాశాల విద్యార్ధులు 40 మంది, ముస్లిం మైనార్టీ కళాశాల విద్యార్ధులు 56 మంది మొత్తం 96 ఈ ప్రయోగ పరీక్షలకు హాజరు అవుతారని తెలిపారు.