నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్గొండ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ కు పివో, ఏపీవోలుగా నియమించబడిన వారికి ఈనెల 8, 9 తేదీలలో 3 వ విడత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వీరికి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని ,ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు విడతల వారిగా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అందువల్ల పిఓ, ఏపిఓ లు ఈ శిక్షణ కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని ఆయన ఆదేశించారు.