
రెంజల్ మండలం కందకుర్తి ఎత్తిపోతల పథకం రెండవ స్టేజి వద్ద గుర్తుతెలియని దుండగులు రెండు 5 హెచ్ పి, మోటార్లను ఎత్తుకెళ్లినట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. గత వారం రోజుల కిందట కందకుర్తి ఎత్తిపోతల పథకం రైతులే ముందుకు వచ్చి పంట కాలువలను మరమ్మత్తులు చేసుకోవడమే కాకుండా ఒక మోటార్ను మరమ్మలు చేసి నడిపించు కుంటున్నారు. నీలా రైతులకు సాగునీటిని అందించాలన్న తలంపుతో వారు గురువారం సెకండ్ స్టేజి వద్దకు వెళ్లి చూడగా రెండు మోటర్లు దొంగిలించబడ్డాయని వారు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులతో పాటు స్థానిక ఎస్సై ఈ .సాయన్నకు సమాచారం అందించగా అధికారులు రాకపోగా, ఎస్సై సఘటన స్థలానికి విచ్చేసి చుట్టుపక్కల గాలిపు చర్యలు చేపట్టగా ఒక మోటర్ అక్కడ వదిలి వేసి వెళ్లినట్లు తెలిసింది. సంబంధిత అధికారులు ఎత్తిపోతల పథకం ప్రారంభించడానికి నిర్లక్ష్యం వహించడమే కాకుండా, మోటార్లకు ఏలాంటి రక్షణ ఇవ్వకపోవడం శోచనీయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటర్లు దొంగతనం జరిగాయని నీటిపారుల శాఖ ఏఈ భుజేందేర్ కు సమాచారమిచ్చినప్పటికీ వారు స్పందించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు.