– సమతా సైనిక్ దల్ ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్
నవతెలంగాణ – ఝరాసంగం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహం యొక్క చూపుడువేలును విరగొట్టిన దుండగులను వెంటనే శిక్షించాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్, ఉస్మానియా విద్యార్థి నాయకులు రాజోల మల్లేష్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని సంఘం- కే గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన స్థలాన్ని వారి సందర్శించి గ్రామస్తులకు భరోసా కల్పించారు. అంతేకాకుండా పొట్టి పల్లి, కప్పాఢ్, కక్కర్వాడ, అల్గోల్ గ్రామాల యువకులు పెద్ద సంఖ్యలో విగ్రహం వద్ద నిరసన తెలిపారు. స్థానిక ఎస్సై రాజేందర్ రెడ్డి కి మండలంలో జరుగుతున్న వివిధ ఘటనలపై ఫిర్యాదు చేసామన్నారు. ఘటన స్థలానికి స్థానిక ఎస్ ఐ చేరుకుని నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు గుండయ్య, తుకారం, కృష్ణ, నవీన్, ప్రేమ్ కుమార్, రచప్పా, నరేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.