మణిపూర్ లో మహిళలను అత్యాచారం చేసి ఊరేగింపు చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి.. 

నవతెలంగాణ- డిచ్ పల్లి
మణిపూర్ లో మహిళలను అత్యాచారం చేసి  ఊరేగింపు చేసిన దుండగులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ కార్యదర్శి జయంతి డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ యూనివర్సిటీలో బాలికల వసతి గృహం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లకు హింసకు బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని, మణిపూర్ ఘటనపై దేశం మొత్తం విచారణ వ్యక్తం చేస్తుందని, డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి ఇదేనా అని రెండు నెలలకు పైగా హింస జరుగుతున్న ప్రధాన మంత్రి మౌనం వహించడం సరైంది కాదని, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని , మహిళ చట్టాలను పక్కాగా అమలు చేయాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని, మణిపూర్ లో రెండు జాతుల మధ్య ఘర్షణలను నివారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి  జన్నారపు రాజేశ్వర్,తే.యూ పి.డి.ఎస్.యూ అధ్యక్షులు వి.సంతోష్, తే.యూ నాయకులు కవిత,సరోజ,సాయిరాం, అక్షయ్,శివసాయి,ఆకాష్,అశ్విత్,గంగూలీ,మనోజ్ తదితరులు పాల్గొన్నారు.