మేడారం సమ్మక్క సారలమ్మ హుండీలను దేవదాయ శాఖ అధికారులు భారీ బందోబస్తు నడుమ గురువారం లెక్కించారు. సమ్మక్క ఆదాయం రూ. 22,36,564, సారలమ్మ ఆదాయం రూ. 18,67,016, గోవిందరాజు ఆదాయం రూ. 1,17,761, పగిడిద్దరాజు రూ. 91, 636. సమ్మక్క సారలమ్మ మొత్తం వనదేవతల ఆదాయం 43, 12, 97 7 లక్షలు ఆదాయం వచ్చినట్లుగా ఎండోమెంట్ ఈవో రాజేంద్రం తెలిపారు. మహా జాతర 21 నుండి 24 వరకు జరగా తదనంతరం వచ్చిన మేడారం ఆదాయం అని తెలిపారు. కాగా స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు, ఎండోమెంట్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.