సంక్రాంతి సంప్రదాయం ఎంతో ఆనందాన్ని కలిగించింది ఎస్సై విజయ్ కొండ

నవతెలంగాణ మద్నూర్

ఈనెల 14న మంగళవారం నాడు జరుపుకున్న సంక్రాంతి పండుగ ఇక్కడి సంక్రాంతి సంప్రదాయం ఎంతో ఆనందాన్ని కలిగించిందని మద్నూర్ ఎస్సై విజయ్ కొండ అన్నారు. సంక్రాంతి పండుగ ఉత్సవాల్లో భాగంగా మద్నూర్ మండలంలోని మేనూర్ అశోక్ పటేల్ చేనులో జరిగిన సంక్రాంతి సంబరాలు ఎస్సై పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పత్రిక విలేకరులు బంధువు మిత్రులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ ఉత్సవాలకు హాజరైన ఎస్సైకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు విలేకరులకు బంధుమిత్రులకు అశోక్ పటేల్ కృతజ్ఞతలు తెలియజేశారు.