ఆకాశంలో దట్టమైన పొగ ఆవహించింది
ధూళి కణాల చాటున
సూరీడు దాక్కుండిపోయాడు
ఉన్నట్లుండి ఒక్కసారిగా అలజడి మొదలైంది
యుద్ధ సెరైన్ లతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది
ఆకాశానికి చిల్లులు పడి గ్రహశకలాలు
నేరుగా భూమిని ఢకొీడుతున్నట్లు
పైటర్ జెట్ విమానాల నుంచి
జారి పడుతున్న క్షిపణులు
నేరుగా జనావాసాలని తాకుతున్నారు
ఏం జరుగుతోందో తెలియడం లేదు
కళ్ళు మూసి తెరిచేలోపే అంతా బూడిదైపోయింది
ఆధిపథ్యం కోసం ఆరంభమైన యుద్ధం
అంతమొందించే దాక ఆగనంటోంది
ఆయుధ వ్యాపారాన్ని రెట్టింపు చేసుకోవడానికి
అగ్రరాజ్యాలు యుద్ధాన్ని ఉసిగొల్పుతున్నారు
ఆయుధ యంత్రాలు అమ్ముకొని
అంతా స్మశానం ఐన తర్వాత
శాంతి మంత్రాలు ఎవరికి కావాలా
భవిష్యత్ కు బంగారు బాట వేసుకోవాల్సిన
యువత బంకర్లలో తలలు దాచుకుంటున్నారు
పాలు తాగాల్సిన శిశువులు
శిథిలాల కింద నలిగిపోతున్నారు
బడికెళ్లాల్సిన బాలలు
ప్రాణభయంతో వణికి పోతున్నారు
యుద్ధం వల్ల సాధించేదేముంది
తలలు ఛిద్రమైన శవాల దిబ్బల మధ్య
చిన్నారి కారుస్తున్న అశ్రు బిందువులు తప్పా
అక్కడ ఎవరున్నారని పాలించడానికి
సెలయేరులా పారుతున్న ప్రజల రక్తపుటేర్లు తప్పా
శిథిలాల కింద నలిగిపోయిన
శిశువుల దేహాల తప్పా
అక్కడ ఏముందని పాలించడానికి
కాలిపోయిన బూడిద తప్పా ???
– కోనేటి నరేష్, 8499847863