రైతుల కష్టం దొంగల పాలు..

Farmers' trouble is the milk of thieves.నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని వడ్లం గ్రామంలో రైతు పంటపొలం అడవి జంతువులు నుండి రక్షణ కోసం రైతు తన పొలం లో సోలార్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే అదునుగా కొందరు దుండగులు సోలార్ సెట్ నీ దొంగతనం కు పాల్పడ్డారు, రైతు తన పండించిన పంటను అమ్మీ కొనుగోలు చేసిన సోలార్ సెట్ దొంగతనానికి గురికావడం పట్ల కన్నీటిపర్యంతం అయ్యాడు. తన కష్టాన్ని దోపిడీ చేసిన దొంగలను వెతికి శిక్షించాలి అని స్థానిక పోలీసులకు పిర్యాదు చేశాడు. పంపు సెట్లు,సోలార్, మోటర్ స్టార్టర్,కేబుల్ వైర్ లు దొంగతనలు జరగడం నిత్యకృత్యం గా మారిందని స్థానికులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలు పట్ల పోలీసు లు చర్యలు తీస్కుని గ్రామాలలో నిఘా వ్యవస్థ ను ఏర్పాటు చెయ్యాలి అని కోరుతున్నారు.