
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే అని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్ పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఎం పార్టీ తొర్రూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్థూపాలను మండలంలోని కంటాయపాలెం గుర్తురు,, అమ్మాపురం , హరిపిరాల గ్రామాలలో అమరవీరుల స్తూపాల వరకు బైక్ ర్యాలీ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎం డి యాకూబ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై న అశోక్ మాట్లాడుతూ 1946 లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో కమ్యూనిస్టు నాయకత్వాన రజాకార్లకు దేశ్ముకులకు ఫ్యూడల్ భూస్వామ్య శక్తులకు వ్యతిరేక మైన పోరాటం. దున్నేవానికి భూమి కావాలని జరిగిన మహత్తర పోరాటం 1951 వరకు సాగింది. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో జరిగిన ఈ పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర కమ్యూనిస్టులది అని అన్నారు. తెలంగాణలో వేటికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో 4500 మంది ప్రాణాలను కోల్పోయారు. అంతిమంగా భారతదేశంలో భూ సమస్యను ఎజెండా మీదికి తెచ్చిన చరిత్ర కమ్యూనిస్టులది అన్నారు. ఈ చరిత్రను వక్రీకరిస్తూ బిజెపి ఆర్ఎస్ఎస్ భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటం కాదు హిందూ ముస్లిం పోరాటం అనడం సిగ్గుచేటు అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పోరేట్ శక్తులకు దారాదత్తం చేసి, ధరల స్థిరీకరణ చట్టాలు ఉల్లంఘించి, బిజెపి ప్రజలు వాడుకునే నిత్యవసర వస్తువుల ధరలను ఆహార ధాన్యాలను కృత్రిమ కొరత సృష్టించి పేదలపై భారాలు మోపిందని విమర్శించారు. రష్యా భారతదేశానికి కారు చౌకగా ఇస్తున్న వంటగ్యాస్ ను మన దేశ ప్రజలకు ఇవ్వకుండా బడా కార్పొరేట్ శక్తులైన అదాని, అంబానీలకు దారాదత్తం చేసిన ఘనత బిజెపి మోడీది అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర తెలిసిన ప్రజలే బిజెపికి గుణపాఠం చెప్తారని అన్నారు.సిపిఎం మండల కార్యదర్శి ఎం డి యాకుబ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం భారతదేశం సమైక్యతతో ఉండాలి అంటున్నాడు. మతాల మధ్య చిచ్చుపెట్టే బిజెపి ఎజెండానే కెసిఆర్ అమలు చేస్తున్నాడని విమర్శించారు. దళితులకు ఇవ్వవలసిన దళిత బంధు టిఆర్ఎస్ బంద్ గా మారిందని ఆయన విమర్శించారు. తెలంగాణ అంటేనే కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అంటేనే తెలంగాణని ఎప్పుడైనా తెలంగాణ కమ్యూనిస్టుల అడ్డేనని అని కమ్యూనిస్టుల పోరాటాలను ప్రజలంతా తొందరగా మర్చిపోరని వారు అన్నారు. ప్రజలందరూ కమ్యూనిస్టులను ఆదరించి అధికారంలోకి తీసుకువచ్చే దాంట్లో ముందు వరసలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సోమిరెడ్డి, బోర స్వామి, మార్క సాంబయ్య, గుద్దేటి సాయి మల్లు, జమ్ముల శ్రీను, డోనక దర్గయ్య, కంటాయపాలెం ఉపసర్పంచ్ గజ్జి రామ్మూర్తి, ఉమా గాని యాకయ్య, తిమ్మిడి రవి, తాళ్ల వెంకటేశ్వర్లు ,శంకర్, జితేందర్ రెడ్డి, రామ్ రెడ్డి ,కాయల ఎల్లయ్య, కుమార్, సోమన్న , ధరావత్ యాకన్న, సుమన్ ,గోపాల్ తదితరులు పాల్గొన్నారు.