టీఎస్‌పీఎస్సీ బోర్డును వెంటనే ప్రక్షాళన చేయాలి

నవతెలంగాణ-గోదావరిఖని: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే గ్రూప్‌-1 పరీక్షలు రద్దు అయ్యాయని, వెంటనే టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి గ్రూప్‌-1 అభ్యర్థులందరికీ కూడా లక్ష రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్‌ఐ) జిల్లా అధ్యక్షుడు కొంటు సాగర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా టీఎస్‌పీఎస్సీ బోర్డును వెంటనే ప్రక్షాళన చేయాలని రామగుండం కార్పొరేషన్‌ ఈస్ట్‌ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈస్ట్‌ ఏరియా కమిటీ కన్వీనర్‌ చంద్రగిరి కష్ణకుమార్‌, కో కన్వీనర్‌ మొగిలిచర్ల సురేష్‌, నాయకులు శివ కుమార్‌, రాజ్‌ కుమార్‌, ఉమెన్స్‌ కన్వినింగ్‌ కమిటీ సభ్యులు కల్పన, లావణ్య, హామీదా, సంధ్యారాణి, కావ్య పాల్గొన్నారు.