నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: మునుగోడు నియోజకవర్గం ఎన్నిక ఏదైనా రాష్ట్రంలోనే అత్యధికంగా ఓట్లు నమోదై చరిత్రలో నిలుస్తున్న మాట వాస్తవమే.నిన్న జరిగిన మునుగోడు సాధారణ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 2,52,648 మంది వీటిల్లో పురుషులు 1,26,223 మహిళలు 1,26,421 ఓటర్లు ఉన్నారు.2,31,197 ఓట్లు పోలై 91.51 శాతం రాష్ట్రంలోనే మునుగోడు నియోజకవర్గం అత్యధికం నమోదయింది.2022 జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా 93% పైగా నమోదై రికార్డు సృష్టించింది .మునుగోడు నియోజవర్గంలో 7 మండలాలు 307 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండలంలో అత్యధికంగా గుండ్లోరిగూడెం 165 పోలింగ్ బూత్ లో మునుగోడు నియోజకవర్గంలోనే 98.99 శాతం ఓట్లు పోలైనాయి.అతి తక్కువగా మర్రిగూడ మండలం యరగండ్లపల్లి బూత్ నంబర్ 234లో 70.94 శాతంగా ఓట్లు నమోదయింది.ఏది ఏమైనా మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక నుండి రాష్ట్ర,దేశ రాజకీయాల్లో మునుగోడు అంటేనే పేరు మారుమోగిపోతుంది అని నియోజవర్గ ప్రజలు సంబరపడుతున్నారు