నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి గ్రామానికి చెందిన బాలరాజు ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశారు. స్థానికులు గమనించి మంటలు ఆర్పె ప్రయత్నం చేసిన అప్పటికే ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. ద్విచక్ర వాహనానికి నిప్పంటించిన దుండగులను పట్టుకొని న్యాయం చేయాలని బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.