కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలను తొక్కడడానికి యు జి సి ప్రతిపాదనను తీరలేపిందని, యూజీసీ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా 5వ మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి కోరారు. శనివారం రోజున భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షులు చింతల శివ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలను తుంగలో తొక్కడడానికి యూనివర్సిటీలో యుజిసి ప్రతిపాదనను తీరలేపిందని, ఈ ప్రతిపాదన వల్ల రాష్ట్ర యూనివర్సిటీల పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వం చేతిలో వెళుతుందని రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులను కాలయాపన చెందుతుందని, ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, యూనివర్సిటీ యొక్క పూర్తి అధికారం కేంద్రం చేతుల వెళుతుంది, దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విద్యారంగంలో మతోన్మాద భావాలు చూపిస్తూ దేశ విశ్వవిద్యాలయంలో అభ్యుదయ బావాజలంపై దాడులు పెంచుతుంది, శాస్త్రీయ విధానాన్ని వక్రీకరిస్తూ విద్యార్థులకు పూకటి పురాణాలు వల్లించి వారి మెదడులను ముద్దుపరిచే విధంగా అవలంబిస్తుందని అదేవిధంగా రాష్ట్రంలో ప్రజాపాలన పేరు చెప్పి సంవత్సరం గడుస్తున్నా గానీ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన విప్లమైందని పెండింగ్లో ఉన్నటువంటి 8300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయకుండా కాలయాపన చేస్తుందని రాష్ట్రంలో విద్యా మంది విద్యాశాఖ మంత్రి లేక విద్యారంగం గాడి తప్పిందని, స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోచలిజం లక్ష్యాలు కలిగినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థుల పక్షాన రాజిలేని పోరాటాలు నిర్వహిస్తుందని, 1970లో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ ఇప్పటికీ 55 సంవత్సరాలు పూర్తి చేసుకొని, విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ అగ్రగామి సంఘంగా ఉందని, ఈ తరుణంలో ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా 5వ మహాసభలు ఈనెల జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీలలో పోచంపల్లి పట్టణంలో జరిగే ఐదవ జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామని, మహాసభలను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి మల్లేశం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కుక్కుట్ల శివాని, జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఈర్ల రాహుల్ పాల్గొన్నారు.