
నవతెలంగాణ – మిరు దొడ్డి
దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో,హాస్టల్స్ లలో జనవరిలో భారత రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం పై వ్యాస రచన పోటీలు నిర్వహించరు.ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ఉపాధ్యక్షుడు భీమ్ శేఖర్ మంగళవారం ఆయన మాట్లడుతూ జనవరి లో మిరుదొడ్డి లో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో వ్యాస రచన పోటీ నిర్వహించడం జరిగిందన్నారు.వ్యాస రచన పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులు దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ఉపాధ్యక్షులు భీమ్ శేఖర్,ప్రిన్సిపాల్ చేతుల మీదగా అందజేయడం జరిగిందన్నారు. రాజ్యాంగం పై ప్రతి ఒక్కరు అవగహన పెంపొందించుకొవాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్వర్ణలత, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.