సీఎంగారూ…నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు!

CM... there are unemployed!తెలంగాణలో నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగుల ఉద్యోగ ఆకాంక్షలను నెరవేర్చే బాధ్య తను తక్షణంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముం దు హామీనిచ్చిన విధంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు, నాలుగువేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించే విష యంలో స్పష్టమైన విధివిధానాలు ప్రకటించాలి. ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో యువతకు నమ్మకం కలిగేలా కాం గ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఇది తక్షణావసరం కూడా. ఎందు కంటే గత బీఆర్‌ఎస్‌ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అ త్యంత ఎక్కువగా మోసగించబడ్డది, అన్యాయానికి గురైనది నిరుద్యోగ యువతేనన్నది స్పష్టం. ఉద్యోగ నియామకాల కోసం వేసిన నోటిఫికేషన్లు రద్దు కా వడం, పేపర్‌ లీకేజీలు, లిటిగేషన్లు, కోర్టు వివాదా లు మూలంగా ఆశించిన రీతిలో ఉద్యోగాలు రాక పోగా నిరుద్యోగ యువత పూర్తి నిరాశ, నిస్పృహ లకు లోనైంది. వందల మంది బలవన్మణాలకు పాల్పడ్డ పరి స్థితి. ఉద్యోగాల భర్తీ చేపట్టడం ఇష్టం లేకనే ప్రభుత్వమే ఉద్దేశ పూర్వకంగా పరీక్ష పేపర్‌ లీకేజీలకు పాల్పడిందన్న ఒక వాదన కూడా బలంగా ముందుకొచ్చింది. నీళ్లు, నిధులు, నియామ కాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి త్యాగాలకు సిద్ధపడిన యువతను ప్రభుత్వం పట్టించుకోలేదు.
యువత త్యాగాల మూలంగా వచ్చిన రాష్ట్రంలో ఒన గూరిన ప్రయోజనమేంటి? మోసపూరిత వాగ్దానాలు, నయ వంచన తప్ప. ఉద్యోగ నియామకాల విషయమై ప్రకటనలు, కాలయాపనతోనే యువతను మభ్యపెడుతూ వచ్చింది గత ప్రభుత్వం. ఎన్నికల ముందు 80 వేల ఉద్యోగాలు భర్తీ చేయు టకు ఆగమేఘాల మీద, కొన్ని నోటిఫికేషన్లు వేసింది. కొన్నిం టికి రాత పరీక్షలు నిర్వహించింది. గ్రూప్‌ 1 పేపర్‌ లీకేజీ కారణంగా ఒకసారి, ఓఎంఆర్‌లో అభ్యర్థుల వివరాలు లేక పోవడం చేత హైకోర్టు జోక్యంతో రెండోసారి వాయిదా పడిం ది. ఎన్నకల షెడ్యూల్‌ కారణం చేత గ్రూప్‌ 2, డీఎస్సీ పరీక్షలు రద్దు చేసింది. పలు కారణాలు, వివిధ ఆటంకాల నడుము ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు అధి కారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీలైనంత మేరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టాలి. అసలు రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖ ల్లో ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయో స్పష్టం చేయాలి. బిశ్వాల్‌ కమిటీ పిఆర్‌సి రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 1,91,126 ఉద్యో గ ఖాళీలు ఉన్నట్టు అంచనా. అసెంబ్లీ ఎన్నికల పేరుతో మొ త్తం ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా తమ ఎన్నికల మేని ఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిం ది. ముఖ్యమంత్రి ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎప్పుడెప్పుడు మొదలుపెడతారోనని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.
తెలంగాణకు మొత్తం మంజూరైన పోస్టులు 4 లక్షల 91,304 కాగా, 3లక్షల 178మంది ఉద్యో గులు మాత్రమే పని చేస్తున్నట్లు పీఆర్సీ రిపోర్టు తెలి పింది. దీంతో మొత్తం 1,91,126 ఉద్యోగాలున్నా యని పీఆర్సీ తన నివేదికలో వెల్లడించింది. గతంలో ఏ శాఖలో ఎంతమంది ఉద్యోగులున్నారన్న విష యాన్ని పీఆర్సీ నివేదికలో పేర్కొంది. అత్యధికంగా పాఠశాల విద్యాశాఖలో మొత్తం 1,37,851 పో స్టులు మంజూరు కాగా 1,13, 883 మంది పని చేస్తున్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో 98,394 పోస్టులకు గాను 61,212 మంది విధులు నిర్వహిస్తున్నారు. అత్యంత ముఖ్యమైన వైద్యారోగ్య శాఖలో 52,906 పోస్టులు మంజూరు కాగా ఇందులో కేవలం 22,336 మంది మాత్రమే పని చేస్తు న్నారు. మరో కీలకమైన రెవెన్యూ శాఖలో 23,786 పోస్టులో గాను 19,825 మంది, పంచాయతీరాజ్‌ విభాగంలో 26, 2001 పోస్టులకు 13,573మంది ఉద్యోగులు మాత్రమే విధు లు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 50వేల 400 మంది కాంట్రాక్టు, 58,128 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యో గులు పనిచేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అయినా రాష్ట్రంలో మొత్తం 39 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వేతన సవరణ సంఘం తేల్చింది రాష్ట్రంలో ప్రతి వెయ్యి మం దికి 14 మంది ఉద్యోగులు ఉండాల్సింది. కానీ అనేక పోస్టులు ఖాళీగా ఉండడం చేత వెయ్యిమందికి కేవలం 8.5శాతం మం ది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని తన నివేదిక స్పష్టం
చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు ఏ విధమైన ప్రాధాన్యతనిస్తుందో, యువత, ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలోనూ అంతే ప్రాధాన్యత ఇవ్వడం అనేది ప్రథమ కర్తవ్యంగా వుండాలి. చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు ఏ విధమైన ప్రాధాన్యతనిస్తుందో, యువత, ఉద్యోగ ఉపాధి కల్పన విషయంలోనూ అంతే ప్రాధా న్యత ఇవ్వడం అనేది ప్రథమ కర్తవ్యంగా వుండాలి.
ప్రభుత్వ పాలన సక్రమంగా, సజావుగా జరగాలన్నా, ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలన్నా, అన్ని శాఖల్లో పూర్తిస్థాయి సరిపడా ఉద్యోగ నియామకాలు చేప ట్టడం అవసరం. అత్యంత ప్రాధాన్యతగల రంగం ఏదైనా ఉం దంటే అది విద్యారంగం. ఇందులో సుమారుగా 23 వేల ఉపా ధ్యాయ ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక బోధన కుంటుపడుతోంది. ఏండ్ల నుండి ఉపాధ్యాయ నియామకాలు లేవు. డిఎస్సీ కోసం లక్షలాది మంది అభ్య ర్థులు ఆశతో ఎదురు చూస్తున్నారు. 5,089 పోస్టులకు డీఎస్సీ వేస్తామని గత ప్రభుత్వం ప్రక టించింది. అదే మాదిరిగా 13,086 పోస్టులతో పాటు ఇటీ వల ఉపాధ్యాయుల పదోన్నతులతో ఏర్పడిన 9,979 పోస్టు లను కలిపి మెగా డీఎస్సీ నిర్వహించాలనేది ప్రస్తుతం నిరు ద్యోగుల ప్రధాన డిమాండ్‌. పాఠశాల విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టేందుకు సుమారుగా 23 వేల ఉపా ధ్యాయ పోస్టులు భర్తీ చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. పాఠశాలలు, కళాశాలలే కాదు, యూనివర్సిటీల్లోనూ ఎక్కువ మొత్తంలో ఖాళీలున్నాయి.పెరిగిన గురుకులాల సంఖ్యకనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బంది నియా మకాలు జరగలేదు.పేదలకు మరింత నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు నియామకాలు చేపట్టడం అవసరం.
ఉద్యోగ నియామకాల విషయంలో టీఎస్పీఎస్సీ బోర్డు, ప్రభుత్వంఘోర వైఫల్యం కారణంగా అప్రతిష్టను మూట గట్టుకుంది. టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనీ ప్రధానంగా చర్చ జరిగింది. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టగానే ఈ విషయంపై దృష్టి సారించడం మంచి విషయం. గత టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్‌, సభ్యుల రాజీనామాలు చేయడం, ఇటీవల కాలంలో టీఎస్పీఎస్సీ బోర్డు నూతన చైర్మన్‌, మరి కొంతమంది సభ్యుల నియామకానికి గవర్నర్‌ ఆమోదించడంతో నియామక ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుత టీఎస్పీఎస్సీ బోర్డు నూతన చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియామకం పట్ల భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీలో సరిపడా అధికారులు సిబ్బంది లేరన్న విమర్శ కూడా ఉంది. వీటన్నింటిని ఒక్కొక్కటిగా పరిశీలించాలి. ముందుగా టీఎస్పీఎస్సీలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి. ఉద్యోగాల నియామకాల విషయంలో గతంలో జరిగిన విధంగా లోపాలు జరగకుండా పరీక్షలను అత్యంత పకడ్బంధీగా, నాణ్యతగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలి. జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా ఫిబ్రవరి ఒకటిన గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ వేస్తామని ప్రక టించిన ప్రభుత్వం, ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. గ్రూప్‌ 3, గ్రూప్‌ 4 ఫలితాలు, గురుకుల రాత పరీక్షల ఫలితాలు ప్రకటించాలి. పోలీస్‌ నియామకాల విషయంలో జీవో 46పై నెలకొన్న గందరగోళాన్ని పరిష్కరించాలి. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన కోసం కృషి చేయాలి. స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.గత పదేళ్లలో ఉద్యోగ నియామకాల్లో జరిగిన తీవ్ర నష్టాన్ని భర్తీ చేస్తూ, నిరు ద్యోగ యువత ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో నిరుద్యోగం, ఉద్యోగ ఖాళీలపై ప్రత్యేక చర్చ చేసి జాబ్‌ కాలెండర్‌ను విడుదల చేయాలని యువత కోరుతోంది.
కోట రమేష్‌