– ఏకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రవీందర్‌రెడ్డి
నవతెలంగాణ-షాద్‌నగర్
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కొత్త పాతల కలయిక అని తక్కువ ఆదాయం పన్ను లు చెల్లించే వారికి ఊరటగా చెప్పుకోవచ్చు అని ఏకనామిక్స్ అసిస్టెంట్ డాక్టర్ ఎస్ రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రారంభంలో పన్నులు మూడు నుంచి ఏడు లక్షలు కాకుండా పది లక్షలకు పెంచి ఉంటే బాగుండేది, మూడు లక్షలు కాకుండా ఐదు లక్షల వరకు పన్నులు లేకుంటే ఎంతో మందికి ఆర్థిక లాభం చేకూరేదని అన్నారు. అలాగే ఐదు సంవత్సరాల్లో 4.1 కోట్ల మందికి ఉద్యోగాల సష్టి అనేది నిజంగా మంచిదని చెప్పొచ్చు దీనికోసం బడ్జెట్లో రెండు లక్షల కోట్లు కేటాయించడం కూడా ఒక ఆశావహ చర్య అనవచ్చని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా మహిళా సాధికారతకు మరియు మహిళా శ్రామిక శక్తికి ఊతమిచ్చే విధంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏర్పాటు హర్షణీయమని, ఇది మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించి సంస్థలకు రెండు సంవత్సరాలు పాటు ఈపీఎఫ్ లో సహాయం చేస్తాం అనడం కొంతవరకు కొత్త సంస్థకు ఊరట ఇచ్చే అంశమని, యువతలో నైపుణ్యం పెంచుటకు వెయ్యి ఐటీఐలను అప్డేట్ చేయడం మంచిదైనప్పటికీ ఇంకా ఎక్కువ ఐటీఐలను అత్యంత అధునాతనంగా అప్డేట్ చేయడం వల్ల భవిష్యత్తులో నాణ్యమైన యువతగా మారుతారని చెప్పవచ్చు.ఉన్నత విద్య అభ్యసించి విద్యార్థులకు మూడు శాతం వడ్డీతో ఈ- ఓచర్స్ జారీ నూతన చర్యగానే అభివర్ణించవచ్చుని,స్థిరాస్తి వ్యాపారం చేసే మధ్యతరగతి వారికి ఆస్తి అమ్మడం కొనడం మధ్య వ్యత్యాసం పై 12 శాతం పైగా పన్ను వేయడం భారమే అని చెప్పవచ్చని అన్నారు.