మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రెండో మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ

నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ( TUCI) ఆద్వర్యం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభ వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ శనివారం నిర్వహించినారు. మున్సిపల్ పరిధిలోని  మామిడిపల్లి గ్రామ పంచాయతీ వద్ద శనివారం నిర్వహించాగా, టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్స్ 129 మున్సిపాలిటీలలో సుమారు 60 వేల మంది కాంటాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారని అన్నారు .పట్టణాలను శుభ్రంగా ఉంచి ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడే వారే మున్సిపల్ కార్మికులు అని అన్నారు మలమూత్రాలు అపరిశుభ్రమైన గుంతల్లో దిగి శుభ్రం చేస్తూ ఊపిరాడక చచ్చి శవాలుగా మిగిలిపోతున్నారని వారు అన్నారు. ఆయన కనీస వేతనాలు కరువయ్యాయని కార్మికులకు పంజాబ్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ కోర్టులో వేసిన రిపిటిషన్ పై 2016లో ఒకే రకమైన పనికి ఎక్కువ తక్కువ వేతనాలు ఇవ్వరాదని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆయనప్పటికీ అధికారులు ప్రభుత్వాలు పట్టించుకోకుండా కనీస వేతనాలు ఇవ్వకుండా కార్మికుల పొట్ట కొడుతున్నారని వారు అన్నారు కొన్ని మున్సిపాలిటీల్లో బడ్జెట్ లేదని కారణంతో సకాలంలో వేతనాలు కూడా ఇవ్వడం లేదని వారు అన్నారు వెంటనే కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని అదేవిధంగా అదేవిధంగా గతంలో పెరిగిన పిఆర్సి 30% వేతనాలు  బకాయిలను చెల్లించాలని మున్సిపల్ కార్మికులు రాష్ట్ర మహాసభల్లో కార్మిక సమస్య చర్చించుకొని భవిష్యత్తు ఉద్యమ ప్రాంతాల్లోకి అడుగు వేయడానికి జరిగే మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్మల నిఖిల్, ఎర్రన్న, పి సాయన్న, లక్ష్మి, గంగవ్వ తదితరులు పాల్గొన్నారు.