గ్రామకంఠం భూమి ఖాళీ స్థలం దళితులకే దక్కాలి

– ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు కంద పెద్ద నరసింహ
నవతెలంగాణ-కందుకూరు
గ్రామకంఠం భూములలో పశువుల కొట్టాలు వేసుకున్న దళితులకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు కంద పెద్ద నర సిం హ డిమాండ్‌ చేశారు. శుక్రవారం కందుకూరు పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆందోళన చేశారు. ఆయన మాట్లాడుతూ.. మండలం బేగంపేట గ్రామ కంఠం భూమిలో 30 ఏండ్ల నుండి ఆగ్రామాని కి చెందిన దళితులు పశువుల దొడ్లు ఏర్పాటు చేసుకొని పశువులకు ఉపయోగకరంగా ఉంటుంద ని కొంతమేర గ్రామకంఠం భూమి తమ ఆధీనంలోనికి తెచ్చుకున్నారు. శుక్రవారం అదే గ్రామానికి చెందిన అండేకార్‌ ఆనంద్‌ బంధువులు ఈ స్థలం తమకే చెందుతుందని పశువుల పాకను తొలగించి, కడీలు పాత డానికి ప్రయత్నం చేశారని చెప్పారు. దళితులు ఇదే గ్రామంలో ఎన్నో ఏం డ్లుగా ఉంటున్నారని, అండే కార్‌ ఆనంద్‌ కుటుంబీకులు 40 ఏండ్ల నుం డి హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారన్నారు. గ్రామ ఖంఠం భూమికి వారికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. వారికి ఎలాంటి సంబంధమూ లేని ఈ విషయంలో గ్రామ ఖంఠం భూమి తమది అంటూ కడీలు పాతడానికి ప్రయత్నం చేసిన వారిపై శాఖపర మైన చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో గోల్కొండ మైసయ్య, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్య క్షులు నరసింహ, గోల్కొండ బుచ్చయ్య, గోల్కొండ శీను, గోల్కొండ శంకర్‌, గోల్కొండ రవి, దళితులు పాల్గొన్నారు.