సష్టిలో అతి మధురం సుధాతుల్యమైన స్నేహం
తేనెను వీడని మధురమోలె
పూవును వీడని తావి వలె
వజ్రమును వీడని మెరుపు వలె
జాబిలిని వీడని జ్యోత్స్న వలె
పసి పిల్లల నవ్వు వలె కలకాలం వీడిపోని బంధం
కష్టసుఖాలలో తోడై నిలిచే
స్నేహబంధము ముందు
నవరత్నాలూ సాటి రావు
అంతటి విలువైన స్నేహము
కలకాలం పదిలంగా నిలువుకొనుము
– సరికొండ శ్రీనివాసరాజు