ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పది..

The value of vote in democracy is very great.– డీఈవో ఈ. శ్రీనివాస్ రెడ్డి..
నవతెలంగాణ – తొగుట
విద్యార్థులకు మక్ పోలింగ్ ద్వారా రాజ్యాంగం, ఓటు యొక్క విలువ తెలిసిందని డీఈవో ఈ. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని వెంకట్రావుపేట జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో విద్యార్థులకు మాకు పోలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులకు రాజ్యాంగంపై ఉన్న నమ్మకం, కట్టుబాట్లు, నియ మాల గురించి పూర్తిగా తెలిసి ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులు ఓటు విధానాన్ని బట్టి మంచి నాయకులను ఎన్నుకొని దేశానికి, రాష్ట్రానికి దిక్సూచిగా నిలవాలని తెలిపారు. ప్రభు త్వాలు ఏర్పడుతున్న ఓటుకు ప్రాముఖ్యత లేకుం డా పోయిందని మంచి నాయకున్ని ఎన్నుకొని రాజ్యాంగాన్ని రక్షించి రాబోవు తరాలకు విలువల తో కూడిన పరిపాలన కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ప్రజా స్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వడ్లకొండ నరసయ్య, ప్రధానోపాధ్యాయురాలు నహిమ కైసర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.