
నవతెలంగాణ – అశ్వారావుపేట
డీసీఎం వ్యాన్ ఒకటి పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.మండలంలోని ఊట్లపల్లి వైపు నుంచి అశ్వారావుపేట కు వస్తున్న డీసీఎం వ్యాన్ పోలీస్ స్టేషన్ వద్ద అదుపుతప్పి స్టేషన్ గేటును ఢీ కొట్టి ఆగిపోయింది.అయితే వ్యాన్ డ్రైవర్ అతిగా మద్యం సేవించి,ఆ మత్తులో వాహనాన్ని వేగంగా నడిపాడు.గమనించిన స్థానికులు వ్యాన్ ను నిలువరించేందుకు యత్నించగా ఈ ఘటన చోటుచేసుకుంది.అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వ్యాన్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.