ఉర్దూ భాషలో వర్సిటీకి గుర్తింపు తీసుకురావాలి..

Recognition should be brought to the varsity in Urdu language..– అబ్దుల్ ఖవి అవార్డు రావడం సంతోషదాయకం..
– వైస్ ఛాన్సలర్ టి యాదగిరిరావు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖవి కి  ప్రతిష్టాత్మక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉర్దూ అకాడమీ చే పరిశోధన విమర్శ రంగంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం అభినందనీయమని వైస్ ఛాన్సలర్ టి యాదగిరిరావు పేర్కొన్నారు.ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ టి యాదగిరిరావు,  రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి  డాక్టర్  మహమ్మద్ అబ్దుల్ ఖవి ని సోమవారం యూనివర్సిటీ లో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉర్దూ విభాగంలో  పరిశోధన రంగంలో  మరింత లోతుగా పరిశోధనలు జరిపి యూనివర్సిటీ కి  గుర్తింపు తీసుకురావాలని  వైస్  ఛాన్సలర్ డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖవికి  గుర్తు చేశారు.గత పది సంవత్సరాలుగా యూనివర్సిటీలో వివిధ అకాడమిక్, అడ్మినిస్ట్రేటివ్ పదవులలో సమర్థవంతంగా  నిర్వహిస్తున్న అబ్దుల్ ఖవి ఈ ప్రతిష్టాత్మక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోవడంతో  తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ( టూటా) అధ్యక్షులు డాక్టర్ ఏ.పున్నయ్య,  ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ బాబు, ఉపాధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి డాక్టర్ నాగరాజ్, డాక్టర్ జమీల్  డాక్టర్ వాసం చంద్రశేఖర్,  డాక్టర్ బాలకిషన్, డాక్టర్ నీలిమ  ఇతర అధ్యాపకులు నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.