– యుద్ధ ప్రాతిపదికన తీగల వాగు బ్రిడ్జిని మరమ్మతు చేయాలని
– ర్అండ్ బి అధికారులను, జెన్ కో అధికారులను కోరిన దండు రమేష్.
నవతెలంగాణ-మల్హర్ రావు:
మండలంలోని డబ్బగట్టు దగ్గర తీగల వాగుపై బ్రిడ్జి బొగ్గు, ఇసుక లారీలు, హెవీ వెహికల్స్ నడవడం వలన గుంతలు పడి ఇనుప సువ్వలు తేలి బ్రిడ్జి కూలిపోయే స్థితిలో ఉన్నా కూడా గత పది సంవత్సరాలు గా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి పట్టించుకోలేదని, వెంటనే యుద్ధ ప్రాతిపదికన తీగల వాగు బ్రిడ్జిని మరమ్మతు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను, జెన్ కో అధికారులను దండు రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఏ ఇ అవినాష్, మంత్రి శ్రీధర్ బాబు ఆంతరంగిక సహాయకులు కొక్కు ప్రవీణ్,జిల్లా కార్యాయదర్శి మండల రాహుల్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం క్రాంతి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు,రూపేష్ రావు,మురళి,ఏఎంఆర్సిపి ఆర్ఓ మల్లేష్,మూర్తి ,సేఫ్టీ ఇంజనీర్ పాల్గొన్నారు.