
చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట గ్రామంలో గ్రీన్ స్టార్ ప్లాట్ల ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.గ్రీన్ స్టార్ వెంచర్ ఎదుట టెంట్లు వేసి ఆదివారం ప్లాట్ల బాధితులు ధర్నా నిర్వహించారు. గ్రీన్ స్టార్ వెంచర్ లో 2000-2001 సంవత్సరంలో సర్వే నెంబర్ 23,33 లల్లో నెలకు వేయి రూపాయల కిస్తుల చొప్పున 100 గజాల ప్లాట్లు కొనుగోలు చేశామని చెప్పారు.ఈ విధంగా ఒక్కొక్కరు 200,100 గజాల చొప్పున 110 ప్లాట్లను కొనుగోలు చేశామని,మా పేరా రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నా మని ప్లాట్ల బాధితుల సంఘం అధ్యక్షులు కే.సత్యనారాయణ తెలిపారు.వెంచర్ యజమాని అంబికా ప్రసాద్ మా ప్లాట్లకు కబ్జా చేసుకుని ప్లాట్ల చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.2021 సంవత్సరంలో ప్లాట్ల వద్దకు పోతే వెంచర్లోకి రానీయకుండా త్రివ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సత్యనారాయణ తెలిపారు. అప్పట్లో అంబిక ప్రసాద్ పై చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయిందని అన్నారు.ప్లాట్ల బాధితులు మా ఫ్లాట్లు మాకు కావాలని నినాదాలు చేస్తూ అంబికా ప్రసాద్ నుంచి రక్షణ కల్పించాలని కోరారు.వెంచర్ దగ్గరికి వస్తే సెక్యూరిటీని పెట్టుకొని,కుక్కలను మా మీదకి తోలి త్రివ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ప్లాట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఎన్నోసార్లు చౌటుప్పల్ తహసిల్దార్,ఆర్డీవో లకు ఫిర్యాదు చేసిన అంబికా ప్రసాద్ మమ్మల్ని ప్లాట్ ల వద్దకు రానీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నా డని అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూకబ్జాదారులను ఉక్కుపాదంతో తొక్కుతానని చెబుతున్న భూకబ్జాదారులు ప్లాట్ల యజమానులకు ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అన్నారు.గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్లాట్లకు మాకు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ స్టార్ ప్లాట్ల యజమానుల అసోసియేషన్ ఉపాధ్యక్షులు చిలుకూరి లక్ష్మారెడ్డి కార్యదర్శి సయ్యద్ అలీముద్దీన్ సహాయ కార్యదర్శి గండ్ల వేణుగోపాల్ కోశాధికారి లలిత కుమారి ఎగ్జిక్యూటివ్ మెంబర్లు దారా,ఆరిఫుద్దీన్ బాధితులు తదితరులు పాల్గొన్నారు.