– బిజెపి మండల అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్
– మండల కేంద్రంలో బాంబులు పేల్చి బిజెపి శ్రేణులు సంబరాలు
నవతెలంగాణ -తాడ్వాయి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం చారిత్రాత్మకమని బిజెపి సీనియర్ నాయకులు, తాడ్వాయి మండల అధ్యక్షులు తాల్లపెల్లి లక్ష్మణ్ గౌడ్ అన్నారు. శనివారం ఢిల్లీ గెలుపుతో మండల కేంద్రంలో బిజెపి శ్రేణులు టపాసులు కాల్చితు బాంబులు పేల్చుతూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిపరులను ప్రజలు ఇంటికి సాగనంపుతార అనడానికి ఢిల్లీ ఎన్నికలే నిదర్శనం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయామ్ లో దేశం సుభిక్షంగా ఉందని ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ను కోరుకున్నారన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి విజయ డంకా ముగిస్తుందని భీమ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా, మండల నాయకులు మల్లెల రాంబాబు, మాదర్ శ్రీకాంత్, సిద్దబోయిన సురేందర్, సుభాష్ గౌడ్, హనుమంత రెడ్డి, కోరిక వెంకట్రాం, దేవి సింగ్, భూక్య శ్రీనివాస్, జీడి ప్రశాంత్, వెంకన్న, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.