తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్కిస్టు) పోటీ చేయడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేనిఫెస్టో ప్రకటిం చడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గత ఎన్నికల్లో బహుజన లెప్ట్ ఫ్రంట్ (బీఎల్ ఎఫ్) పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన పార్టీ ఈసారి ఒంటరిగా, అదీ 19 స్థానాల్లో పోటీ చేయడంతో పాటు ప్రచారంలో దూసుకుపోతుండటం పట్ల కమ్యూనిస్టులు, సానుభూతి పరులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో ఆయా సందర్భాల్లో పొత్తుల వ్యవహారాలు చాలామందిలో కొంత అసహనానికి గురిచే శాయి. మతోన్మాద బీజేపీని ఓడించేందుకు మునుగోడు లో బీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని కమ్యూనిస్టులు విజ యవంతమయ్యారు. మళ్లీ అదే దిశగా బీఆర్‌ఎస్ పొత్తు లకు సిద్ధపడాలనే సంకేతాలివ్వగా పొత్తు సర్దుబాట్లు ఉంటాయని అందరూ భావించారు. కానీ పాలక పార్టీ ల నిజస్వరూపం ఈ ఎన్నికల సందర్భంగా బయటప డింది. ‘ఏరు దాటేదాక ఓడ మల్లన్న…ఏరు దాటాక బోడ మల్లన్న’ అన్న చందంగా బీఆర్‌ఎస్ వ్యవహరిం చింది. అయితే ఒకింత ఇది మంచిదేననే అభిప్రాయం ప్రజల నుంచి వస్తోంది. సీపీఐ(ఎం) ఒంటరిపోరుకు సిద్ధమవ్వడంతో వామపక్ష అభిమానులు, కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ప్రజా సంక్షేమం పట్ల సమగ్ర విధానం కలిగి ఉన్న సీపీఐ(ఎం) ఎన్నికల నినాదాలు నేడు రాష్ట్రంలో ప్రజల్ని కూడా ఆలోచింప జేస్తున్నాయి. అందులో మొదటిది బీజేపీని ఓడించడం. అయితే ఏ పార్టీ అయినా గెలుపు కోసం ప్రయత్నిస్తుంది కానీ, పక్కవాళ్ల ఓటమే లక్ష్యంగా పనిచేయదు. ఈ క్రమంలో సీపీఐ(ఎం) మొదటి ఎత్తుగడే బీజేపీని ఓడించడం అన్నది ఎందుకానేది ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. అది మతతత్వ పార్టీ గనుకనే మునుగోడులో బీజేపీని ఓడించడానికి సీపీఐ(ఎం) బీఆర్ ఎస్‌తో పొత్తు పెట్టుకుని అందులో సపలీకృతమైంది. ఈ దేశంలో ఏ వివక్షా, ఉన్మాదాలు ఉండొద్దని రాజ్యాంగం కోరు కుంటుందో, ఏ సబ్బండ వర్గాల వారికైతే సమన్యాయం దక్కాలని ప్రజాస్వామ్య యుత రాజ్యాంగం కోరుకుంటుందో వాటిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాల రాస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కోదశలో రైతు లను, విద్యార్థులను, కార్మికులను, మీడియాను అణచివేసి, ప్రశ్నించిన వాళ్లందరిని అణగదొక్కింది. ఇదే కాదు.. ఫక్తు మత రాజకీయాలు చేస్తూ.. దేశంలో ముస్లింలే తమ మొదటి శత్రువుగా ప్రకటిస్తూ విద్వాంసాలకు తెరలేపుతు ఉన్మాదంగా వ్యవ హరిస్తోంది. ముఖ్యంగా దళితులన్నా, వారి గురించి మాట్లాడే సంఘాలన్నా , వారి అభివద్ధికి ఉపయోగపడే పథకాలు, వనరులన్నా బీజేపీ ఏ మాత్రం వాటిని సహిం చదన్నది వాస్తవం. ఈ ఉన్మాదాన్ని అడ్డుకొనే శక్తి కేవలం కమ్యూనిజానికి ఉంది. అది కేవలం తెలంగాణలో కాదు. ప్రపంచ చరిత్రలో నిరూ పితమైన వాస్తవం. ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికా దేశా ల్లో మతాధికారులు, పెట్టుబడిదారులు రాజ్యమేలుతూ జనాల సంక్షేమాన్ని వదిలేసి, పేదలను పీడిస్తుంటే వాటికి వ్యతిరే కంగా నిలబడి, పోరాడి ప్రజాస్వామ్య, లౌకిక, కార్మిక, పేదల సంక్షేమ ప్రభుత్వాలను నెలకొల్పింది కమ్యూనిజమే అన్నది చారిత్రక సాక్ష్యం. ముందు ఉన్మాదాన్ని అడ్డుకోవడం ద్వారానే అది సాధ్యం.
ఇలా దేశంలో బీజేపీ ఉన్మాద భావాలను అడ్డుకొనేందుకు కమ్యూనిస్టు పార్టీ అవసరం. కమ్యూనిస్టు పార్టీల విజయాలు, కేవలం సీట్లు గెలుచుకొని చట్టసభల్లోకి వెళ్లడంలోనే ఉండదు. ప్రజలకు నష్టం కలిగించే శక్తులను అడ్డుకోవడంలోనే ఉంటుందని సీపీఐ(ఎం) తెలంగాణ సెక్రటరీ తమ్మినేని మాటల్లో స్పష్టమవుతోంది. ఆ పార్టీ రెండో నినాదం లెఫ్ట్ పార్టీలు చట్టసభల్లో ఉండటం. ఈనాటి చట్టసభ ప్రభువుల వారికి ఆస్థాన విధ్వాంసులతో నిండి ఉంది. సమస్యలపై మాట్లాడే వారి కన్నా.. వారి నాయకున్ని గాల్లోకి ఎత్తే ఉపన్యాసాలతో ప్రగల్భాలు పలికే వారితో నిండిపోతోంది. ఈ క్రమంలో ప్రజల గొంతు వినిపించడానికి, ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించడానికి ప్రతినిధులు ఉండాలి. ఆ ప్రతినిధులు కమ్యూనిస్టులు కావాలని ఈ పార్టీ నేత చెప్పడం హర్షనీయం. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ సమావేశం లేదు. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో కూడా కమ్యూనిస్టులు లేని సభలు ఊహిం చకూడదు. కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించే బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఎంతైనా ఉన్నది. వారి గెలుపు చారిత్రక అవసరం. కమ్యూనిస్టులు గెలిస్తేనే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బతికించుకోగలమనేది వాస్తవం. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే అసెంబ్లీలో కమ్యూనిస్టులు ఉండాలి. ఈ దిశగా తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయమిది. అడుగులు వేయాల్సిన తరుణమిది.
– వినోద్ మామిడాల, 7660066469