గ్రామ ప్రత్యేక అధికారికి సన్మానించిన గ్రామ కమిటీ..

The village committee honored the special officer of the village.నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండలం కూనేపల్లి జిల్లా పరిషత్ పాఠశాల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులతో పాటు, గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో హెచ్ శ్రీనివాసును గ్రామ అభివృద్ధి కమిటీ ఘనంగా శాలువలు పూలమాలలతో సత్కరించారు. వారికి మెమొంట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, నోడల్ అధికారి ఆంజనేయులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నీరడి సాయిలు, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, లింగం, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, గ్రామ కార్యదర్శి కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.