గ్రామ చెరువులే సబ్బండ వర్గాల జీవనదారమైనవి

– చెరువుల పండుగకు హజరైన ఎమ్మెల్యే రసమయి
నవతెలంగాణ-బెజ్జంకి
సీఎం కేసీఆర్ సుదూర దృష్టితో చేపట్టిన మిషన్ భగీరథ ద్వార రాష్ట్రంలోని చెరువులను పునరుద్దించారని..పునరుద్దరించిన చెరువులే నేడు గ్రామంలోని సబ్బండ వర్గాల ప్రజలకు జీవనదారమైనవని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనందం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో మండల కేంద్రంతో పాటు బేగంపేట,వడ్లూర్ గ్రామాల్లో నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యేల రసమయి హజరయ్యారు.అనంతరం మండల కేంద్రంలో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.మండలంలోని గ్రామాల్లో చెరువుల పండుగను ప్రజాప్రతినిధుల ఘనంగా నిర్వహించారు. అయా గ్రామాల ప్రజాప్రతినిధులు,బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు.