నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన ప్రైమరీ పాఠశాల లో పాడుబడిన శిథిలవస్థలో ఉన్న రెండు అదనపు గదులను తొలగించడం జరిగిందని గ్రామ కార్యదర్శి రాజేందర్ రావు పేర్కొన్నారు. ఇటీవల రెంజల్ మండలాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఈ భవనాన్ని చూసి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆయన ఆదేశాల మేరకు జెసిబి తో దానిని తొలగించి నట్లు ఆయన తెలిపారు. చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తొలగించిన మట్టిని సైతం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో గుంతల మయంగా మార్గంతో అక్కడికి తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.