శ్రమదానం చేసిన గ్రామ యువత..

The village youth who contributedనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండలం మల్లాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శనివారం, తాము చదువుకున్న పాఠశాలలో పరిసరాలను, మట్టి కుప్పలను చదును చేసి, శుభ్రం చేశారు. తాము చదువుకున్న పాఠశాలలో స్వచ్చందంగా శ్రమదానం చేయడాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గవ్వల రాములు గ్రామ యువకులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ మున్ముందు మీయొక్క సహకారము ఇలాగే ఉండాలని, గ్రామాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి మీలాంటి యువకులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువకులతో పాటు పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.