అభివృద్ధి కోసం సహకరించాలని ఎమ్మెల్యే ను కోరిన గ్రామస్థులు..

నవతెలంగాణ-తొగుట
గ్రామ అభివృద్ధి పనులకు సహకరించాలని దుబ్బా క ఎమ్మెల్యే ను మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, గ్రామ మాజీ ఉప సర్పంచ్ మంగ యాదగిరి కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే స్వగ్రామం పోతారంలో లింగంపేట గ్రామ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి, శాలువతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మూడవ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించారని తెలిపారు.భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గెలుపు దుబ్బాక నియోజ కవర్గ ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు.అదే విందంగా గ్రామ అభివృద్ధి కోసం సహకరించాలని ఎమ్మెల్యే ను కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు వస్తానని హామీ ఇచ్చా రని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాసరి సుదర్శన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమీర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు షేఖ్ అబీద్ హుస్సేన్, మాజీ ఉప సర్పంచ్ గొడుగు బైరయ్య,భూత్ అధ్య క్షుడు లక్ష్మణ్ గౌడ్, యూత్ అధ్యక్షుడు గణేష్, సోషల్ మీడియా అధ్యక్షుడు వంశీ, నాయకుల నర్సిం లు,ధర్మయ్య తదితరులు ఉన్నారు.