నవతెలంగాణ – ధర్మసాగర్
మండలంలోని నారాయణగిరి గ్రామ పంచాయతీ కార్యదర్శి జె రఘు అవినీతి కి పాల్పడుతున్నారని గ్రామనికి చెందిన చెందిన మజ్జిగ లింగం, గంటే కృష్ణయ్య హనుమకొండ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నూతన గృహ నిర్మాణ అనుమతి కి, ఇతర గ్రామ పంచాయతీ పనులకు డబ్బులు వసూలు చేస్తున్నాడని, స్థానిక గ్రామంలో నివాసం ఉండకుండానే హౌస్ అలవెన్స్ తీసుకుంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. గ్రామంలోని ప్రజలు పలు సందర్భాలలో సమాచార హక్కు చట్ట ప్రకారం కోరిన విషయాన్ని సక్రమంగా తెలుపకుండా కాలయాపన చేస్తూ, సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో గాంధీ విగ్రహం వద్ద ఉన్న వినాయక మండపాన్ని కూల్చివేతపై, గ్రామంలో వినాయక మండప కమిటీకి సమాచారం ఇవ్వకుండా ఎలాంటి వాదనలు లేకుండా,అర్ధరాత్రి మండపాన్ని కూల్చివేయడం పై సమాచారం ఇవ్వకుండా గ్రామస్తుల వాదనులపై సమగ్ర వివరణ తెలుపకుండానే మాటదాటు వేయడం జరిగిందని తెలిపారు.ఆ ప్రదేశంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న, రోడ్డు పనులకు అనుమతి లేకున్నా గాంధీ విగ్రహము నుండి మాచర్ల కిషన్ గౌడ్ నివాసానికి 20 మీటర్ల దూరం 10 ఇంచుల ఎత్తు గా సీసీ రోడ్డు పోయించి, ఆ ప్రాంతంలో ఉన్న గృహాలకు ఇబ్బంది కలిగే విధంగా, పూర్వం రోడ్డు ఉన్నప్పటికీని తన ఇష్టానుసారం రోడ్డు నిర్మించడం పైన వీరి ఇరువురుపై తగిన సాక్షదారాలతో ఫోటోలతో సహా ఆన్లైన్లో ఫిర్యాదులు చేయడం జరిగిందని ఆరోపించారు. నారాయణగిరి గ్రామపంచాయతీ సెక్రటరీ జె రఘు పై అక్రమ నిర్మాణాలు చేపట్టిన మాచర్ల కిషన్ గౌడ్ వీరు ఇరువురు గ్రామంలో అనేక రకాల అక్రమాలకు పాల్పడుతూ, ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు,ఇబ్బందులకు గురి చేస్తున్నారని వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని వారు తెలిపారు.