పంతంగి సమస్యలను తహసీల్దార్ కు వివరించిన గ్రామ ప్రజలు

The villagers explained the Pantangi problems to the Tehsildarనవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
పంతంగి గ్రామంలో స్థానిక సమస్యలు పరిష్కరించాలని మండల తహసిల్దార్ శివకోటి హరికృష్ణ బుధవారం సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో స్థానిక సమస్యలపై సీపీఐ(ఎం) పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్టీ మండల నాయకులు చిరిక సంజీవ రెడ్డి బోయ యాదయ్య గార్లు మాట్లాడుతూ పంతంగి గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పది రోజుల క్రితం పోరుబాట కార్యక్రమం నిర్వహించి స్థానిక సమస్యలను వెలికి తీసి ఆ సమస్యలపై గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది.  ముఖ్యంగా అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాలని,పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లను పూర్తి చేయాలని,అదేవిధంగా అండర్ డ్రైనేజీలను కూడా పూర్తి చేయాలని అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని, నిరుపేద కుటుంబాలకు పంతంగి గ్రామంలో  100 గజాల స్థలాన్ని కేటాయించాలని,ఎస్సీ కమ్యూనిటీ హాల్ ని పూర్తి చేయాలని, గౌడ సంఘం భవనాన్ని నిర్మించాలని,రైతు వేదిక పక్కన ఉన్న  భూమి ఎంత ఉందో గుర్తించి రైతు వేదికకు అప్పజెప్పాలని,కూరగాయల మార్కెట్ ను ఓపెన్ చేయాలని,ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించి ఒక డాక్టర్ను నియమించాలని అనే వాటిపై ధర్నా నిర్వహించి స్థానిక తాసిల్దార్ పంచాయతీ ప్రత్యేక అధికారికు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి రత్నం.శ్రీకాంత్ మహిళా కార్యదర్శి చీరిక.అలివేలు ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు రాజు పెరియర్ సిపిఎం నాయకులుచిట్యాల బుచ్చిరెడ్డి,కడగంచి రాజేష్,బోయ మారయ్య,అణగంటి  బొందయ్య,నేరేడు మహేష్,గుండెపురం  మల్లయ్య,నందగిరి వెంకటేష్,డివైఎఫ్ఐ నాయకులు సుక్క శ్రీకాంత్,బోయ పృధ్విరాజ్,రొడ్డ శ్రీకాంత్,బోయ సాయి కిరణ్, బర్రె శశిధర్ తదితరులు పాల్గొన్నారు.