నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లాడేగాం గ్రామములో యువ నాయకుడు రాజశేఖర్ పటేల్ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ముప్పై గ్రామాల సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచులకు శాలువా గాందీ టోపీలను వేసి సన్మానించారు. రెండు రోజులు తరువాత పదవి కాలం ముగియనుండటంతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన తోటి లాడేగాం గ్రామ సర్పంచ్ అశ్వీని రాజశేఖర్ పటేల్ కు సన్మానితులు కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం తేనేటి విందును ఆహవ్వనించారు. కార్యక్రమంలో సర్పంచులు , ఎంపిటిసిలు, మిత్రులు , శ్రేయేాబిలాషులు తదితరులు పాల్గోన్నారు.