నవతెలంగాణ-భిక్కనూర్ : స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులు గ్రామపంచాయతీకి సహకరించాలని పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ తెలిపారు. గురువారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో పారిశుద్ధ పనులు, మంచినీటి మరమ్మతు పనులు, వాటర్ ట్యాంకుల వద్ద ట్యాబ్ లో, వాటర్ లీకేజ్ మరమ్మత్తు పనులు గ్రామపంచాయతీ సిబ్బంది చేత చేపట్టారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలు నీటిని వృధా చేయవద్దని, నీటి సమస్య ఉంటే గ్రామపంచాయతీలో తెలియజేయాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు వ్యాపించకుండా ఇంటి పరిసరాలలో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.