ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

– జీ.పీ.ప్రత్యేక అధికారి డాక్టర్ బండి వార్ విజయ్

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఈనెల 31న ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ ప్రత్యేక అధికారి డాక్టర్ బండి వార్ విజయ్ గ్రామ ప్రజలను కోరారు. జిపి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరానికి ఎస్ ఆర్ మల్టీస్పెషల్టి ఆస్పత్రి బాన్సువాడ వైద్యులు జనరల్ గా అన్ని రకాల చికిత్సలకు అందించనున్నారని, ఈ ఉచిత వైద్య శిబిరం గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీనిని వినియోగించుకోవాలని ప్రత్యేక అధికారి గ్రామ ప్రజలను కోరారు.